పెళ్లికి ఒత్తిడి .. వదిలించుకోవాలనే అప్సర హత్య , సాయికృష్ణ స్కెచ్ గీశాడిలా: పోలీసులు

Siva Kodati |  
Published : Jun 09, 2023, 07:11 PM ISTUpdated : Jun 09, 2023, 07:17 PM IST
పెళ్లికి ఒత్తిడి .. వదిలించుకోవాలనే అప్సర హత్య , సాయికృష్ణ స్కెచ్ గీశాడిలా: పోలీసులు

సారాంశం

అప్పరను చంపేందుకు సాయికృష్ణ పక్కా ప్లాన్ వేశాడని తెలిపారు శంషాబాద్ డీసీపీ. ఆమెను వదిలించుకోవాలనే హత్య  చేశాడని .. ఇద్దరికి బంధుత్వం లేదని, కానీ ఒకటే కమ్యూనిటీ అని ఆయన చెప్పారు.

అప్పరను చంపేందుకు సాయికృష్ణ పక్కా ప్లాన్ వేశాడని తెలిపారు శంషాబాద్ డీసీపీ. అప్సర హత్య కేసుపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.. ఏడాది నుంచి అప్సర, సాయికృష్ణ మధ్య శారీరకంగా , మానసికంగా రిలేషన్ వుందన్నారు. ఈ ఏడాది మార్చిలో తనను తనను పెళ్లి చేసుకోవాలని అప్సర కోరిందని డీసీపీ తెలిపారు. కారు బాడీ కవర్‌తో ఊపిరి ఆడకుండా చేసి చంపాలని స్కెచ్ వేశాడని.. అయితే అప్సర ప్రతిఘటించడంతో బెల్లం కొట్టే రాయితో తలపై పది సార్లు కొట్టి హత్య చేశాడని ఆయన వెల్లడించారు. చంపిన తర్వాత మిస్సింగ్ కేసుగా నమ్మించేందుకు సాయికృష్ణ ప్రయత్నించాడని డీసీపీ పేర్కొన్నారు. 

ఆమెను వదిలించుకోవాలనే హత్య  చేశాడని .. ఇద్దరికి బంధుత్వం లేదని, కానీ ఒకటే కమ్యూనిటీ అని ఆయన చెప్పారు. చెన్నైకి చెందిన అప్సర హైదరాబాద్‌కు వచ్చి సెటిలైందని డీసీపీ చెప్పారు. సాయికృష్ణ స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురమని ఆయన పేర్కొన్నారు. అప్సర డిగ్రీ చేశారని.. పూజారి సాయికృష్ణకు 2010లో వివాహమైందని, ఒక పాప కూడా వుందని డీసీపీ తెలిపారు. సాయికృష్ణకు వివాహమైందని తెలిసినా .. వివాహం చేసుకోవాలని అప్సర ఒత్తిడికి గురిచేసిందని డీసీపీ వెల్లడించారు.

Also Read: పక్కా ప్లాన్‌తో హత్య: కారులోనే ఒక్క రోజంతా అప్సర డెడ్‌బాడీ

కోయంబత్తూరు వెళ్దామని అప్సరను కారులో తీసుకెళ్లాడని .. మే 3వ తేదీ రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి వెళ్లారని ఆయన తెలిపారు. ఆ రోజు రాత్రి 11 గంటలకు శంషాబాద్ సమీపంలోకి తీసుకెళ్లారని డీసీపీ పేర్కొన్నారు. అప్పటికే కారు ముందు సీట్‌లో అప్సర పడుకుని వుందని.. ఈ క్రమంలో తెల్లవారుజామున 3.50కి సుల్తాన్ పూర్ గోశాల వైపు తీసుకెళ్లాడని డీసీపీ తెలిపారు. ఆపై అప్సర ముఖంపై కారు కవరింగ్ షీట్‌ను కప్పేసి ఊపిరి ఆడకుండా చేశాడని ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu