ఇతరులతో చనువు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడితోనే అప్సర హత్య: శంషాబాద్ సీఐ శ్రీనివాస్

By narsimha lode  |  First Published Jun 9, 2023, 2:27 PM IST

ఇతరులతో  చనువుగా  ఉండడమే కాకుండా  తనను  పెళ్లి  చేసుకోవాలని  ఒత్తిడి  చేయడంతో  అప్సరను హత్య  చేశానని  సాయికృష్ణ  ఒప్పుకన్నాడని శంషాబాద్  సీఐ  శ్రీనివాస్ చెప్పారు.
 


హైదరాబాద్: పెళ్లి  చేసుకోవాలని ఒత్తిడితోపాటు ఇతరులతో  చనువుగా  ఉండడం  భరించలేక   అప్సరను చంపినట్టుగా  సాయికృష్ణ ఒప్పుకున్నాడని  శంషాబాద్  సీఐ  శ్రీనివాస్  చెప్పారు. 

సరూఱ్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోని మ్యాన్ హోల్  నుండి అప్సర మృతదేహన్ని  వెలికి తీశారు.  అనంతరం   శంషాబాద్  సీఐ  శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.  గతంలో  అప్సరకు  ప్రెగ్నేన్సీ వచ్చిందని,  దీనికి తానే కారణమని  వేధించిందని  సాయికృష్ణ  తమ విచారణలో చెప్పారన్నారు. ఇతరులతో  చనువుగా  ఉంటూ కూడ   తన వల్లే  గర్భవతి  అయ్యాయని  చెప్పడం తట్టుకోలేక  పోయాయని  సాయికృష్ణ   చెప్పారని సీఐ    శ్రీనివాస్ వివరించారు.  అదే సమయంలో  తనను పెళ్లి  చేసుకోవాలని ఒత్తిడి కూడ  పెంచడంతో  ఆమెను హత్య  చేయాలని  ప్లాన్  చేశానని  సాయికృష్ణ  తెలిపాడని సీఐ చెప్పారు.

Latest Videos

ఈ నెల  3వ తేదీన   అప్సరను  శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి వద్ద  తలపై రాయితో కొట్టి హత్య  చేశాడన్నారు.  తన కారులోనే   అప్సర డెడ్ బాడీని  సాయికృష్ణ సరూర్ నగర్ కు తీసుకువచ్చాడన్నారు. 

also read:అప్సర ఎవరో మాకు తెలియదు, నా కొడుకు మంచోడు: సాయికృష్ణ తండ్రి

తాను పనిచేసే  ఆలయానికి సమీపంలోని  మ్యాన్ హోల్ లో అప్సర మృతదేహన్ని  పూడ్చిపెట్డాని సీఐ  శ్రీనివాస్ వివరించారు.  ఈ నెల  5వ తేదీన  అప్సర తల్లితో కలిసి వచ్చి  తమకు  ఫిర్యాదు  చేశాడన్నారు.  ఈ ఫిర్యాదు  ఆధారంగా   విచారణ చేస్తే  సాయికృష్ణపై అనుమానం వచ్చిందన్నారు.  ఇవాళ  సాయికృష్ణను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే   అప్సరను హత్య  చేసిన విషయాన్ని  సాయికృష్ణ  ఒప్పుకున్నాడని  సీఐ  శ్రీనివాస్ చెప్పారు. 

click me!