
పెద్ద నోట్లు రద్దు అనేది ప్రధాని మోదీ చేసిన గిమ్మిక్కు అని, ఆయన ప్రకటన వల్ల దేశంలోని 100 కోట్ల మంది రోడ్డు పాలయ్యారని అన్నారు.
నోట్ల రద్దు వల్ల ప్రజలు అభద్రతకు గురవుతున్నారని అన్నారు. 20 రోజులు దాటినా పరిస్థితిలో ఏలాంటి మార్పురాలేదన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ నోట్ల రద్దుపై మౌనం పాటిస్తున్నారని విమర్శించారు.
అక్రోష్ దివస్ సందర్భంగా షబ్బీర్ అలీ హైదరాబాద్ లోని ఆర్ బీఐ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలతో కలసి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోట్ల రద్దు తర్వాత కేవలం ఆరు రోజుల్లోనే సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని మూడుసార్లు కలిశారని... దీని వెనుక అంతర్యమేమిటో ప్రజలకు చెప్సాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బీజేపీ నేతలతో కుమ్మక్కైయ్యారని ఆరోపించారు.