పోస్టాఫీసుల్లో ‘నల్ల’ దొంగలు

First Published Nov 28, 2016, 8:33 AM IST
Highlights
  • నోట్ల మార్పడిలో పోస్టాఫీస్ సిబ్బంది అక్రమాలు
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సిబిఐ

నల్ల ధనం నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్ల ను రద్దు చేస్తే..నల్ల కుబేరులకు తమ వంతు సాయం చేస్తున్నారు కొందరు పోస్టాఫీస్ సిబ్బంది.

 

భారీస్థాయిలో నల్లధనాన్ని పోస్టాఫీసుల్లో మార్చుతున్నారు. దీనికి పోస్టల్ సిబ్బంది సహకరిస్తున్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఇలా  నోట్ల మార్పిడి వ్యవహారంలో అవకతవకలకు పాల్పడుతున్న సిబ్బందిపై సీబీఐ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది.

 

రూ. 36 లక్షల కొత్త నోట్లు మార్పిడి చేశారని ముగ్గురిపై అభియోగాలు మోపింది.హిమాయత్‌నగర్ తపాలా కార్యాలయం సిబ్బంది సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, పోస్టుమాస్టర్ రేవతి, సీనియర్ అసిస్టెంట్ రవితేజపై సీబీఐ కేసు నమోదైంది. తపాలా కార్యాలయంలో నోట్ల మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేయగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని సీబీఐ పేర్కొంది.

 

వీళ్ల వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేపడతామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ వెల్లడించింది

click me!