సీఎంవో అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

Published : Feb 26, 2017, 11:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
సీఎంవో అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

సారాంశం

నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసిన ఉద్యోగిణి

తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో చోటు చేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాంపు కార్యాలయ ఉద్యోగిణిపై ఓ సీనియర్ పోలీసులు అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.

 

సీఎం క్యాంప్ కార్యాలయంలో భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇంటలిజెన్స్ విభాగం పోలీసులు అధికారి విద్యాసాగర్  ఓ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది.

 

ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించకుండా మౌనంగా ఉండటంతో ఆమె నేరుగా  సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారట.

 

దీంతో వెంటనే స్పందించిన అధికారులు  డీఎస్పీ హోదాలో  ఉన్న విద్యాసాగర్‌ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బాధితురాలి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.

 

కాగా, సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళపై వేధింపుల గురించి తనకు ఇంటలిజెన్స్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు నివేదిక అందలేదని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే