( video) ఉప్పల్ లో జాబ్ మేళా.. అంతా ఉత్తిదే

First Published Feb 26, 2017, 9:51 AM IST
Highlights

జాబ్ మేళా పేరుతో నిరుద్యోగులతో ఆడుకున్న కన్సెల్టెన్సీ

ఉద్యోగం పేరుతో అభ్యర్థులను మోసం చేయడానికి కొన్ని కన్సల్టెన్సీలు కొత్త వ్యూహాలు పన్నుతున్నాయి. ఎంఎన్ సీలలో డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉద్యోగాలంటూ ఆన్ లైన్ లో భారీ ప్రచారం చేసిన ఓ ప్రైవేటు కన్సల్టెన్సీచివరకు బోర్డు తిప్పేసింది.

 

ఉప్పల్ లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఎంట్రీ ఫీజు కింద అభ్యర్థులు రూ.200 తమకు జమ చేయాలని ఆన్ లైన్ లోనే ఫీజులు చెల్లించాలని కోరింది. తమ ప్రకటనను ఇలా సోషల్ మీడియా వేదికగా భారీ గా ప్రచారం చేసింది.

 

Biggest JOB MELA in Hyderabad Participating 25+ MNC & National companies.

On Sunday 26th Feb. 2017

( 8.30 AM to 6 PM )

Venue: Little Flower Junior College, Uppal, Hyderabad.

Qualification: 10+2, Any Gradution.

    Participating Companies పాల్గొనే సంస్థలు: TECH MAHINDRA, WIPRO, GENPACT, HSBC, HGS, AGS, SBI, ICICI, SYNCHRONICS FINANCE, TCS, AMAZON, PAYTM, KARVY, RELIANCE, KNOAH, IKS, HDFC, 24/7 and CYENT  మొ!!.

అర్హులైన మిత్రులందరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోని ఈ జాబ్ మేళాని జయప్రదం చేయగలరు.

   To Register రిజిస్టరు కొరకు: getmyjob.co.in  వెబ్ సైట్ 

Ph.  ఫోన్ నంబరు: 9032427067

 

దీంతో చాలా మంది అభ్యర్థులు ఈ ప్రకటన నిజమేననుకొని రూ. 200  ఫీజు చెల్లించారు. ఈ రోజు ఉదయం జాబ్ మెళా నిర్వహించే ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ కి వచ్చారు.

జాబ్ మేళాకు దాదాపు 25 ఎంఎన్సీ కంపీలు వస్తాయని నిర్వహకులు తెలిపారు. కానీ, తీరా అక్కడికి వచ్చి చూస్తే ఒక్క కంపెనీ కూడా జాబ్ మేళాకు రాలేదు. దీంతో అవాక్కైన  అభ్యర్థులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలో ఫర్నిచర్ ధ్వసం చేశారు. ఉప్పల్ రోడ్డు పైకి వచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు.

 

click me!