దారుణం.. పాఠ‌శాల‌కు వెళ్తున్న‌విధ్యార్ధిని కిడ్నాప్.. ఆపై ఆత్యాచారం

By Rajesh K  |  First Published Jan 5, 2022, 6:03 AM IST

వనపర్తి జిల్లాలో దారుణం జ‌రిగింది.  కాలినడకన బ‌డికి  వెళ్తున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి.. లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం మల్లాయపల్లిలో చోటు చేసుంది. ఇద్దరు నిందితుల‌పై  పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు.
 


ప్ర‌భుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడ‌వాళ్లు క‌నిపిస్తే చాలు.. కామాంధులకు  కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి. నిత్యం ఎదొక చోట మ‌హిళ‌ల‌పై, చిన్నారుల‌పైనా అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయి. తాజాగా కాలినడకన పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామాంధులు కిడ్నాప్ చేసి.. లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం మల్లాయపల్లిలో చోటు చేసుంది.

పోలీసుల కథనం మేరకు..మల్లాయిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక చింతకుంట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. ప్ర‌తిరోజు త‌న గ్రామం మ‌ల్లాయి ప‌ల్లి నుంచి చింత‌కుంట‌కు కాలిన‌డ‌క‌ను వెళ్తుంట‌ది. ప్ర‌తి రోజులాగానే మంగ‌ళ‌వారం కూడా స‌ద‌రు బాలిక పాఠశాలకు కాలిన‌డ‌క‌న బ‌యల్దేరింది. అయితే..  మల్లాయిపల్లికి చెందిన బోయ తుల్జా నాగరాజు, బోయ దాసరి అనిల్ అనే ఇద్దరు యువకులు మార్గమధ్యలో కాపుకాచి  బాలికను వెంబడించారు.   బైక్ మీద‌ వచ్చి స్కూల్‌ వద్ద వదిలేస్తామని బాలిక‌ను నమ్మించారు. కానీ మార్గ మ‌ధ్య‌లో ఆపి..  బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒకరు లైంగిక దాడికి పాల్పడగా మరొకరు సహకరించారు. 

Latest Videos

Read Also: తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 1000 కేసులు, ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి

ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే.. చంపేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. బాధితురాలు ఏడ్చుకుంటూ  పాఠశాలకు వెళ్లి  జ‌రిగిన విష‌యాన్ని ఉపాధ్యాయులకు చెప్పడంతో వారు కుటుంబసభ్యులు, మల్లాయపల్లి గ్రామ పెద్ద‌ల‌కు స‌మాచారం అందించారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కిరణ్, ఎస్సై నాగన్న సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. తక్షణమే అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.   బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు డిఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.

Read Also: ఒంటికి నిప్పంటించుకుని భార్య ఆత్మహత్య.. ఎనిమిదేళ్ల తరువాత భర్తకు తొమ్మిదేళ్ల జైలుశిక్ష..

ఇదిలా ఉండగా బాలికపై న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, దండోరా, విద్యార్థి సంఘాలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఇద్దరు నిందితుల‌పై  పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్, వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్ హామీ ఇచ్చారు.

click me!