పోలీసుల కళ్లుగప్పి.. అపార్ట్ మెంట్ లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులు, నిర్వాహకురాలు అరెస్ట్..

Published : May 10, 2022, 11:28 AM IST
పోలీసుల కళ్లుగప్పి.. అపార్ట్ మెంట్ లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులు, నిర్వాహకురాలు అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్ లో ఓ అపార్ట్ మెంట్లో రహస్యంగా నడుపుతున్న వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : వ్యభిచార దందాలు ఎక్కువవుతున్నాయి. పోలీసుల కళ్లు గప్పి ఇలాంటి నేరాలకు పాల్పడేవారు పెరిగిపోతున్నారు. Banjara Hills రోడ్ నెంబర్ వన్ లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పోలీసుల కళ్లుగప్పి Brothel నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. Physiotherapy పేరుతో ఈ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్న సదాలక్ష్మి అనే నిర్వాహకురాలు ఆ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా.. సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించి.. సదాలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, బెంగళూరులో ఇలాంటి ముఠానే బయటపడింది. సాధారణంగా ఐటీ రైడ్ లకు భయపడి డబ్బును గోడలను సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంకు ల్లోనూ దాచడం చూసుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ లు చూసి ఉంటాం. కానీ,  టాయిలెట్ లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ఓ ముఠా గుట్టు తాజాగా వెలుగు చూసింది.

ఈ మధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తూ ఉన్నారు.  కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ చోట  వ్య‌భిచారం చేస్తున్న‌ట్లు పక్కా స‌మాచారం అందుకుని స్పెషల్‌ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో ఎంత వెతికినా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంట్లో భాగంగా బాత్రూంను పరిశీలించగా.. ఒక చోట నుంచి గురక శబ్దం వినిపించింది.

శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో పరిశీలించిన ఓ అధికారికి టైల్స్ నుంచి వస్తున్నట్టుగా వినిపించింది.  అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే..  అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన చిన్న గది బయట పడింది. పోలీసులు గది తెరిచి చూడగా అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయటికి చూడడానికి మామూలు ప్రదేశంలాగా కనిపించినా టాయిలెట్ లోపల ఇలా ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా, పనికోసం ఇంటికి వచ్చిన Minor Girlతో Prostitution చేయించిన కేసులో భవానిపురం పోలీసులు ఐదుగురునిందితులను మే 4న arrest చేశారు. ఈ కేసులో vijayawada చిట్టినగర్ సొరంగం ప్రాంతానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి,  కబేలా సెంటర్ కు చెందిన వేముల భార్గవి, వేముల గోపి,  మామిడి ముక్కల మండలం తాడంకి గ్రామానికి చెందిన చలపాటి శ్రీనివాస రావు, గుంటూరు చంద్రమౌళి నగర్ కు చెందిన పోపూరి వెంకట రవికుమార్ లను అరెస్ట్ చేసినట్లు సిఐ మహేంద్ర తెలిపారు. వీరిని రిమాండుకు తరలించారని పోలీసులు చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu