పటాన్ చెరులో కొడుకు కోసం ఇద్దరు తల్లుల పోరాటం: హెచ్ఆర్సీలో కొండల్ నాయక్ పిటిషన్

Published : May 10, 2022, 11:15 AM ISTUpdated : May 10, 2022, 12:22 PM IST
 పటాన్ చెరులో కొడుకు కోసం ఇద్దరు తల్లుల పోరాటం: హెచ్ఆర్సీలో కొండల్ నాయక్ పిటిషన్

సారాంశం

పటాన్ చెరులో అఖిల్ అనే బాలుడి కోసం కన్న తల్లి, పెంపుడు తల్లులు పోరాటం చేస్తున్నారు.  ఈ బాలుడి కోసం రెండు కుటుంబాలు న్యాయ పోరాటానికి సిద్దమయ్యాయి.

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో ఓ బాలుడి కోసం ఇద్దరు తల్లులు పోరాటం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు  ఆ బాలుడి కోసం  పోరాటం చేస్తున్నారు.

Sharada, Kondal Naik లు సహా జీవనం చేశారు. ఈ సహా జీవనం కారణంగా వీరికి ఓ బాబు పుట్టాడు. రెండు నెలల బాబును 2009లో రాజేష్, రమణమ్మ దంపతులకు దత్తత ఇచ్చారు.  ఆ తర్వాత శారద, కొండల్ నాయక్ లు పెళ్లి  చేసుకొన్నారు. అయితే శారద, కొండల్ నాయక్ దంపతులకు పిల్లలు పుట్టలేదు. దీంతో తాము దత్తత ఇచ్చిన బాబు Akhil  ను తమకు ఇవ్వాలని Rajesh, Ramanamma దంపతులను శారద, కొండల్ నాయక్ దంపతులు సంప్రదించారు. అప్పటికే రాజేష్ దంపతులు దత్తత తీసుకొన్న కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకొంటున్నారు.

కొండల్ నాయక్ దంపతులు తమ కొడుకు కోసం తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తాము ఆ బాబును ఇవ్వలేమని  రాజేష్ దంపతులు తేల్చి చెప్పారు. ఈ విషయమై కొండల్ నాయక్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అఖిల్ ను చైల్డ్ వేల్పేర్ అధికారులు తీసుకెళ్లారు. చైల్డ్ వేల్ఫేర్ అధికారుల సంరక్షణలో  అఖిల్ ఉన్నాడు. పెంచిన తల్లిదండ్రులు రాజేష్, రమణమ్మ వద్దే ఉంటానని  అఖిల్ చైల్డ్ వేల్పేర్ అధికారులకు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే తమ కొడుకును తమకు ఇవ్వాలని కొండల్ నాయక్ , శారద దంపతులు HRCని ఆశ్రయించారు.

తమకు పిల్లలు పుట్టకపోవడంతో అఖిల్ కోసం కొండల్ నాయక్ దంపతులు న్యాయ పరమైన పోరాటానికి సిద్దమయ్యారు. అయితే అఖిల్ ను కొండల్ నాయక్ కు ఇచ్చేందుకు రాజేష్ దంపతులు సిద్దంగా లేరు.  ఎవరికి వారు అఖిల్ ను దక్కించుకొనేందుకు పోరాటం చేస్తున్నారు ఇదిలా ఉంటే చైల్డ్ వేల్వేర్ అధికారుల సంరక్షణలో ఉన్న అఖిల్ మాత్రం పెంపుడు తల్లి వద్దే ఉండేందుకు సానుకూలంగా ఉన్నాడు. గతంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది.  ఈ సమయంలో కూడా కన్న కొడుకు కోసం శారద దంపతులు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్