కేబినెట్‌పై కేసీఆర్ కసరత్తు: కేటీఆర్ చుట్టూ ఎమ్మెల్యేల చక్కర్లు

By narsimha lodeFirst Published Dec 28, 2018, 9:59 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ కూర్పుపై ఇక కేంద్రీకరించనున్నారు. మరోవైపు కేబినెట్ లో బెర్త్ కోసం కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ కూర్పుపై ఇక కేంద్రీకరించనున్నారు. మరోవైపు కేబినెట్ లో బెర్త్ కోసం కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండో దఫా ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు మహమూద్ అలీకి కేసీఆర్ మంత్రి పదవిని కేటాయించారు. అలీకి హోంమంత్రిత్వశాఖను కూడ కట్టబెట్టారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కేసీఆర్‌తో పాటు 18 మందికి చోటు ఉంటుంది. ఇప్పటికే మహమూద్ అలీకి మంత్రి పదవి దక్కింది. మరో 16 మందికి కేబినెట్ లో చోటు దక్కనుంది.

గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా పనితీరు ఆధారంగా కేబినెట్ లో బెర్త్ కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరో వైపు విపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలకు కూడ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు కూడ టీఆర్ఎస్ గాలం వేస్తోందనే ప్రచారం  సాగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరితే వారికి ఈ దఫా కేబినెట్ లో చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

విపక్షాలకు గాలం వేయడంతో పాటు టీఆర్ఎస్‌లోని ఎమ్మెల్యేల్లో ఎవరికి ఎవరు చోటు కల్పించాలనే విషయమై కేసీఆర్ ఇక కసరత్తు నిర్వహించనున్నారు.
దేశ రాజకీయాలపై ఇప్పటివరకు కేసీఆర్ కేంద్రీకరించారు. గత టర్మ్ లో కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదు. దీంతో ఈ దఫా కేబినెట్ లో మహిళలకు కేసీఆర్ చోటు కల్పించే అవకాశం లేకపోలేదు.

మరో వైపు కేసీఆర్ కేబినెట్ లో చోటు కోసం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ను కలుస్తున్నారు.కేబినెట్ లో తమ పేర్లను పరిశీలించాల్సిందిగా పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కోరుతున్నారు. తమ అర్హతలను పార్టీ కోసం పడిన కష్టాన్ని కూడ వివరిస్తున్నారు.

జనవరి మూడో తేదీ లోపుగా మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంటుందనే ప్రచారంలో ఉంది. తొలి విడతలో ఎనిమిది మందికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది.
 

సంబంధిత వార్తలు

రంగంలోకి కేటీఆర్: కొప్పుల ఈశ్వర్, వివేక్ మధ్య గొడవకు చెక్

ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

గడ్డం తీస్తారో తీయరో: ఉత్తమ్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

click me!