రంగంలోకి కేటీఆర్: కొప్పుల ఈశ్వర్, వివేక్ మధ్య గొడవకు చెక్

By narsimha lodeFirst Published Dec 28, 2018, 9:43 PM IST
Highlights

: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మాజీ ఎంపీ వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు.
 


హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మాజీ ఎంపీ వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు.

ఈ నెల 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుండి కొప్పుల ఈశ్వర్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా విజయం సాధించారు.అతి తక్కువ మెజారిటీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. ఓటమి అంచుకు వెళ్లి ఈశ్వర్ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కు మాజీ ఎంపీ వివేక్  పరోక్షంగా సహకరించారని ఈశ్వర్ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

టీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశంలో ఈశ్వర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య గొడవను పరిష్కరించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు.

వివేక్, కొప్పుల ఈశ్వర్ మధ్య గొడవ విషయమై కేటీఆర్ ఆరా తీశారు. కరీంనగర్ పార్టీ జిల్లా ఇంచార్జీ మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యతో కేటీఆర్ ఈ విషయమై చర్చించారు.ఈ సమస్యను పరిష్కరించాలని సారయ్యను ఆదేశించారు.

శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన  టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పార్టీ నేతల మధ్య గొడవల గురించి ప్రస్తావించారు. పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు జిల్లాల బాధ్యతలను అప్పగించనున్నారు. 

సంబంధిత వార్తలు

ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

గడ్డం తీస్తారో తీయరో: ఉత్తమ్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

click me!