శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు..

Published : Feb 27, 2022, 09:56 AM ISTUpdated : Feb 27, 2022, 11:48 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తెలుగు విద్యార్థులు..

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలలో మొత్తం 469 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలలో మొత్తం 469 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. రొమెనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 219 భారతీయులతో కూడిని ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. స్వేదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. 

ముంబై చేరుకున్న ప్రత్యేక విమానంలో పలువురు తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఏపీకి చెందిన 10 మంది, తెలంగాణకు చెందిన 15 మంది ఉన్నారు. వీరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వారి యోగక్షేమాలను అధికారులు తెలుసుకున్నారు. 

ముంబై చేరకున్న తెలుగు విద్యార్థుల్లో.. 20 మంది ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకన్నారు. శంషాబాద్‌కు చేరుకున్న విద్యార్థులు మాట్లాడుతూ.. నిన్న రాత్రి 11 గంటలకు ముంబై చేరుకున్నట్టుగా తెలిపారు. భారత ఎంబసీ, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో క్షేమంగా స్వదేశానికి చేరుకోగలిగామని చెప్పారు. క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంకా కొందరు తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లోని బంకర్లలో ఉన్నారని చెప్పారు. 

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు 28 మంది తెలుగు విద్యార్థులు.. 
అలాగే బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానంలో 250 మంది భారతీయులు ఉన్నారు. వీరికి ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. ఇక, ఈ విమానంలో స్వదేశానికి చేరినవారిలో 28 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. వారిలో తెలంగాణకు చెందినవారు.. 17 మంది, ఏపీకి చెందిన 11 మంది ఉన్నారు. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి చేరుకునే వారిపై అన్ని ఏర్పాట్లు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీ చేరుకున్న తెలంగాణ విద్యార్థులను తెలంగాణ అధికారులు తెలంగాణ భవన్‌కు తరలించారు. వీరిని నేడు సాయంత్రం వరకు హైదరాబాద్‌కు తరలించనున్నట్టుగా అధికారులు తెలిపారు. 

మరోవైపు ఏపీ విద్యార్థులను ఆ రాష్ట్ర అధికారులు ఏపీ భవన్‌కు తరలించారు. ఏపీలో భవన్‌కు చేరుకున్న 11 మంది విద్యార్థుల్లో ముగ్గురు కడప విద్యార్థినులు ఉండగా.. వారిని ఉదయం 9 గంటలకు బెంగళూరుకు,  ఐదుగురు విద్యార్థులను మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు, మరో ముగ్గురు విద్యార్థులను సాయంత్రం 6 గంటలకు విశాఖకు తరలించనున్నట్టుగా ఏపీ భవన్ అధికారులు తెలిపారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!