దీపావళి వేడుకల్లో అపశృతి.. సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్న బాధితులు..

By Sumanth KanukulaFirst Published Oct 25, 2022, 9:32 AM IST
Highlights

దీపావళి వేడుకలు కొన్నిచోట్ల అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో బాణాసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలోనే కంటికి గాయాలైన బాధితులు హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.

దీపావళి వేడుకలు కొన్నిచోట్ల అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో బాణాసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలోనే కంటికి గాయాలైన బాధితులు హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు సరోజినీ దేవి  ఆస్పత్రికి దాదాపు 24 గాయాలతో వచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి కంటిచూపు దెబ్బతినకుండా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన 12 మందికి కంటికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఇక, మిగిలిన వారిని ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్ళడానికి వైద్యులు అనుమతించారు. అయితే గాయాలైన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని వైద్యులు  తెలిపారు. 

ఇక, జిల్లాల నుంచి కూడా గాయాలతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నందు వల్ల మంగళవారం మధ్యాహ్నం వరకు కేసులు పెరుగుతాయని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి అధికారులు తెలిపారు. పటాకులు పేల్చడం వల్ల కలిగే గాయాలకు సంబంధించిన కేసులకు మెరుగైన చికిత్స అందించేందుకు సీనియర్ వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఆస్పత్రి అధికారులు ఏర్పాటు చేశారు.

click me!