యాచారం ప్రైవేట్ స్కూల్లో విషాదం: 8వ తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి

Published : Oct 24, 2022, 06:13 PM ISTUpdated : Oct 24, 2022, 06:18 PM IST
యాచారం  ప్రైవేట్  స్కూల్లో విషాదం: 8వ తరగతి విద్యార్ధి అనుమానాస్పద  మృతి

సారాంశం

యాచారంలోని  ఓ ప్రైవేట్  స్కూల్లో  8వ తరగతి  చదువుతున్న   విద్యార్ధి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. విద్యార్ధి మృతిపై పోలీసులు విచారణ  జరుపుతున్నారు.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి  జిల్లాలోని  యాచారం లోని  ఓ ప్రైవేట్ స్కూల్లో  8వ తరగతి  చదువుతున్న  ప్రజ్వల్ రెడ్డి   అనే  విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించారుయాచారం  ఓ  ప్రైవేట్  స్కూల్లో 8వ  తరగతి చదువుతున్న  విద్యార్ధి  ప్రజ్వల్  రెడ్డి  అనుమానాస్పద స్థితిలో  మృతి  చెందాడు.  స్కూల్  హస్టల్ లో  ప్రజ్వల్  రెడ్డి ఉంటున్నాడు.  ప్రజ్వల్ రెడ్డి  మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం  చేస్తున్నారు.ప్రజ్వల్ రెడ్డి ఆత్మహత్య  చేసుకున్నాడా,ఎవరైనా  హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

ఆదివారం  నాడు రాత్రి   ప్రజ్వల్ రెడ్డి హస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టుగా  బంధువులు చెబుతున్నారు. ప్రజ్వల్  రెడ్డి మృతిపై స్కూల్  వద్ద  బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన  నిర్వహించారు. ప్రజ్వల్ రెడ్డి మృతికి గల  కారణమైన వారిని కఠినంగా  శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?