ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్‌లోకి పలువురు మహారాష్ట్ర నేతలు..!

Published : Apr 01, 2023, 01:02 PM IST
ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్..  బీఆర్‌ఎస్‌లోకి పలువురు మహారాష్ట్ర నేతలు..!

సారాంశం

బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు రానున్నారు. 

హైదరాబాద్‌: బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. కేసీఆర్ సమక్షంలో మ‌హారాష్ట్రకు చెందిన రైతు సంఘం కీల‌క నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఆయన  మద్దతుదారులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. 

బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్.. మహారాష్ట్ర రాజకీయాలపై కూడా ఫోకస్ చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్న నేపథ్యంలో.. అక్కడ రెండు బహిరంగ సభలను కూడా నిర్వహించారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన  పలువురు నేతలు బీఆర్ఎస్‌ కండువా కప్పుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి
August Holidays : లాంగ్ వీకెండ్ తో ఆగస్ట్ స్టార్ట్.. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే