జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ అపశృతి.. డ్యాన్ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన బీఆర్ఎస్ నేత..

Published : Apr 01, 2023, 12:54 PM IST
జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ అపశృతి.. డ్యాన్ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన బీఆర్ఎస్ నేత..

సారాంశం

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల పర్యటన వేళ అపశృతి చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్ఎస్ నేత ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల పర్యటన వేళ అపశృతి చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్ఎస్ నేత ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలు.. జగిత్యాలలోని పద్మనాయక  కల్యాణ మండపంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకావాల్సి ఉంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం నేపథ్యంలో.. ఆ పార్టీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే పలువురు పార్టీ నేతలు డ్యాన్స్ చేయసాగారు. 

ఈ క్రమంలోనే డ్యాన్స్ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా గుండెపోటు గురై కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు ఆయనకు సీపీఆర్‌ చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేందర్ మృతిచెందారు. 

దీంతో జగిత్యాల బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. నరేందర్ మృతి నేపథ్యంలో ఈరోజు నిర్వహించాల్సిన  ఆత్మీయ సమ్మేళంను రద్దు చేశారు. ఆయన మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్