బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు చార్జీషీట్ విడుదల చేసింది. వ్యవసాయాన్ని బీఆర్ఎస్ సర్కార్ నర్వీర్యం చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు చార్జీషీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి మూడో చార్జీషీట్ ను విడుదల చేశారు. వ్యవసాయరంగంపై మహేశ్వర్ రెడ్డి చార్జీషీట్ విడుదల చేశారు. చార్జీషీట్ ను విడుదల చేసిన తర్వాత మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
వ్యవసాయం పండగ ఏమో కాని కేసీఆర్ పాలన లో దండగ అయిందని ఆయన విమర్శించారు.
రైతులకి ఏ రకమైన సబ్సిడీలు లేవన్నారు.
కేవలం రైతు బంధు తో దగా చేస్తున్నారని చెప్పారు..రుణమాఫీ చేయక కొత్త రుణాలు పుట్టక రైతులు అవస్థలు పడుతున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.కౌలు రైతుల పరిస్థితి అద్వాన్నంగా మారిందని ఆయన చెప్పారు. గత ఏడాది వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలను అపహాస్యం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. రైతుబంధు వల్ల కేవలం భూస్వాములకే మేలు జరుగుతుందన్నారు. కౌలు రైతుల సంగతి ఏమిటని మహేశ్వర్ రెడ్డి అడిగారు.
భూ కమతాలు, భూ విస్తరణ ఒకటి కాదు కాని ఒకటే అని భ్రమ కలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 70 శాతం కౌలు రైతులే.నన్నారు. కౌలు రైతుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన అడిగారు.సీడ్ బౌల్ ఆఫ్ ఇండియగా అంటూ ప్రగల్బాలు పలికారన్నారు. ఇవాళ ఏమైందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
also read:రేవంత్ రెడ్డి పాదయాత్రపై మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం: హట్ హట్ గా కాంగ్రెస్ సీనియర్ల సమావేశం
నకిలీ విత్తనాల వల్ల ఏటా 15 లక్షల ఎకరాల పంట నష్టం వస్తోందన్నారు. నకిలీ విత్తనాలు తయారు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి వేస్తే ఉరి అని రైతులను సాగుకు దూరం చేశారన్నారు. పెరిగిన ఖర్చులకి అనుగుణంగా మద్దతు ధర ఎందుకు పెంచట్లేదని ఆయన అడిగారు. పంట బీమా లేని రాష్ట్రంగా చేసిన పాపం కేసీఆర్ దేనన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసమైందన్నారు. రైతాంగం పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన విమర్శించారు.