సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

Published : Jan 10, 2023, 04:40 PM ISTUpdated : Jan 10, 2023, 05:25 PM IST
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

సారాంశం

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి గుంతలో పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు.

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి గుంతలో పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం మునిగడపలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మల్లన్న గుడి సమీపంలో కారు అదుపు తప్పి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించారు. 

బాధితులను యదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వేములవాడ శ్రీరాజరాజశ్వేర స్వామి వెళ్లి వస్తుండగా మునిగడప వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గుంతలో పడిపోయింది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?