తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కేడర్ వివాదంపై స్పందించారు కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్. సోమేశ్ కుమార్ తెలంగాణ కేడర్ కాదని .. ఆయనతో పాటు ఏపీకి చెందిన మరో 10 మందిని కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని మహేశ్ గౌడ్ దుయ్యబట్టారు.
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందిగా తెలంగాణ హైకోర్ట్ తీర్పునివ్వడంపై కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమేశ్ కుమార్ తెలంగాణ కేడర్ కాదని హైకోర్ట్ తేల్చిందని.. ఆయనతో పాటు ఏపీకి చెందిన మరో 10 మందిని కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని మహేశ్ గౌడ్ ఫైరయ్యారు. కేసీఆర్‌కు హైకోర్ట్ మొట్టికాయలు వేసిందని.. తెలంగాణకు కేటాయించిన అధికారులను సీఎస్‌గా నియమించాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సోమేశ్ కుమార్ వివాదంపై స్పందించారు. తాను తొలి నుంచి సోమేశ్ కుమార్ నియామకం అక్రమమని చెబుతున్నానని రేవంత్ అన్నారు. తాజాగా హైకోర్ట్ సైతం ఇదే విషయం చెప్పిందని రేవంత్ పేర్కొన్నారు. సీఎస్, ధరణి సీసీఎల్ఏ, రెరాకు హెడ్‌గా వున్నప్పుడు సోమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా డీఓపీటీ రెండు రాష్ట్రాలకు కేటాయించింది. సోమేష్ కుమార్ కు ఏపీ కేడర్ ను డీఓపీటీ అలాట్ చేసింది. అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు.తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించి సోమేష్ కుమార్ ను తెలంగాణ కేడర్ ను కేటాయించింది. పరిపాలన పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించాలని కేంద్రం వాదిస్తుంది.
ALso REad: హైకోర్టు ఆదేశాలు:తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సోమేష్ కుమార్ భేటీ
ఇదే వాదనతో కేంద్ర ప్రభుత్వం క్యాట్ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది.2017లో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ సోమేష్ కుమార్ ను తెలంగాణ కేడర్ కు కేటాయించడాన్ని రద్దు చేసింది. క్యాట్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఏపీ కేడర్ ను సోమేష్ కుమార్ కు కేటాయించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమేష్ కుమార్ స్థానంలో మరొకరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా లేకపోలేదు. ఈ విషయమై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇకపోతే.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో సోమేష్ కుమార్ మంగళవారంనాడు భేటీ అయ్యారు. సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టు మంగళవారంనాడు రద్దు చేసింది. దీంతో సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ తో భేటీ ప్రాధాన్యత నెలకొంది.హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ తో సోమేష్ కుమార్ చర్చించే అవకాశం లేకపోలేదు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సోమేష్ కుమార్ సవాల్ చేస్తారా లేదా అనే విషయమై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.