కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: సీసీఎస్ పోలీసులతో మల్లు రవి భేటీ

By narsimha lode  |  First Published Jan 10, 2023, 3:53 PM IST

కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి  మంగళవారంనాడు  సీసీఎస్ పోలీసులతో సమావేశమయ్యారు. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసులో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి  మంగళవారంనాడు సీసీఎస్  పోలీసులతో  భేటీ అయ్యారు. ఈ నెల  12న విచారణకు రావాలని  మల్లు రవికి  సీసీఎస్ పోలీసులు నిన్ననే  నోటీసులు జారీ చేశారు. దీంతో  మల్లు రవి  సీసీఎస్ పోలీసులతో సమావేశమయ్యారు.

2022 డిసెంబర్  13వ తేదీన  కాంగ్రెస్ వార్ రూమ్ పై  సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ వార్ రూమ్ తో  తనకు ఎలాంటి సంబంధం లేదని  ఆ పార్టీ వ్యూహకర్త  సునీల్ కనుగోలు  హైకోర్టుతో పాటు  సీసీఎస్ పోలీసులకు  స్పష్టం చేశారు.  ఈ విషయమై  పోలీసులు  మల్లురవికి  నోటీసులు అందించారు.  సీసీఎస్ ఏపీపీ ప్రసాద్ తో  మల్లు రవి భేటీ అయ్యారు.  ఏయే సమాచారం కావాలనే విషయమై  ఆయన  ఏసీపీతో చర్చించారు.   ఈ నెల  12న  సైబర్ క్రైమ్ పోలీసులు అడిగిన సమాచారంతో  విచారణకు  రానున్నట్టుగా  మల్లు రవి  ప్రకటించారు. 

Latest Videos

undefined

also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసు.. మల్లు రవికి నోటీసులు జారీచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

కాంగ్రెస్ వార్ రూమ్ కు  తాను  ఇంచార్జీగా  ఉన్నట్టుగా మల్లు రవి  సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో లేఖ రాశాడు.  ఈ కేసు విషయమై  తన వద్ద సమాచారం తీసుకోవాలని మల్లు రవి కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తో పాటు  కల్వకుంట్ల కవిత పై సోషల్ మీడియాలో  అనుచిత పోస్టింగ్ ల విషయమై  కాంగ్రెస్ వార్ రూమ్ పై  పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇదే కేసులో  సునీల్ కనుగోలును  సీసీఎస్ పోలీసులు ఈనెల  9వ తేదీన విచారించారు. విచారణకు పిలిచినప్పుడు రావాలని పోలీసులు  కోరారు.  ఈ కేసులో పోలీసులు ఇచ్చిన  నోటీసులపై  స్టే ఇవ్వాలని సునీల్ కనుగోలు దాఖలు చేసిన పిటిషన్ పై   స్టే ఇచ్చేందుకు  హైకోర్టు నిరాకరించింది. దీంతో  నిన్న విచారణకు  సునీల్ కనుగోలు హాజరయ్యారు. 

click me!