మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. రైలింజన్ తో వ్యాగన్లకు లింకు తెగిపోయింది. ఈ విషయాన్ని గార్డు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మహబూబాబాద్: గూడ్స్ రైలు గార్డు అప్రమత్తంగా వ్యవహరించిన కారణంగా బుధవారంనాడు మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ కు రైల్వే వ్యాగన్లకు మధ్య ఉన్న లింకు తెగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించకుండా గూడ్స్ రైలు లోక్ పైలెట్ రైలును ముందుకు తీసుకువెళ్లాడు.ఈ విషయాన్ని గుర్తించిన గూడ్స్ రైలు గార్డు వెంటనే లోక్ పైలెట్ కు సమాచారం ఇచ్చాడు
also read:ఒడిశా బహనగా రైల్వే ట్రాక్ మరమ్మత్తులు: పలు రైళ్లు రద్దు
.ఈ సమాచారం ఆధారంగా లోకో పైలెట్ రైలును వెనక్కు తీసుకువచ్చాడు. గూడ్స్ రైలుతో తెగిన వ్యాగన్లను జాయింట్ చేశారు. అనంతరం రైలు ముందుకు సాగింది.గూడ్స్ రైలు విజయవాడ నుండి కాజీపేట వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని కేససముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రైలుతో వ్యాగన్లు లింకు తెగిపోయాయి.సకాలంలో ఈ విషయాన్ని గార్డు లోకో పైలెట్ కు సమాచారం ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.