హైకోర్టులో కేసీఆర్ సర్కారు ఎదురు దెబ్బ

Published : Apr 26, 2017, 01:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
హైకోర్టులో కేసీఆర్ సర్కారు ఎదురు దెబ్బ

సారాంశం

జీవో 16 ను కొట్టేసిన హైకోర్టు

తెలంగాణ సర్కారు హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొన్న సింగరేణి వారసత్వ ఉద్యోగాల నియామకం చెల్లదని ప్రభుత్వ జీవోను కొట్టేసిన హైకోర్టు ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవోను కూడా తప్పుపట్టింది.

 

టీఆర్ఎస్ సర్కారు తన ఎన్నికల హామీలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు జీవో 16 ను గతంలో  విడుదల చేసింది.

 

అయితే ఈ జీవోను సవాలు చేస్తూ ఓయూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన అనంతరం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే జీవోను కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్