
హైదరాబాద్: శేరిలింగంపల్లి టిక్కెట్టును కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అనుచరులు గాంధీభవన్ ఎదుట ఆదివారం నాడు ధర్నా నిర్వహించారు. బిక్షపతి అనుచరులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్రజాకూటమి(మహా కూటమి) లోని పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా టీడీపీకి శేరిలింగంపల్లి సీటును కేటాయించవద్దని కోరుతూ గాంధీభవన్ ఎదుట బిక్షపతి వర్గీయులు ఆదివారం నాడు ధర్నాకు దిగారు.
శేరిలింగంపల్లి టిక్కెట్టును పొత్తులో భాగంగా టీడీపికి కేటాయించకూడదని బిక్షపతి డిమాండ్ చేస్తున్నారు.శేరిలింగంపల్లి టిక్కెట్టును కాంగ్రెస్‌కే కేటాయించాలని కోరుతూ గాంధీ భవన్ ఎదుట బిక్షపతి అనుచరులు ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. మరో కార్యకర్త తన చేయిని కోసుకొన్నాడు.వీరిద్దరిని కూడ పోలీసులు, సహచరులు అడ్డుకొన్నారు.
శేరిలింగంపల్లి టిక్కెట్టును కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలంటూ గాంధీ భవన్‌లోనే బిక్షపతి అనుచరులు ధర్నాకు దిగారు. ఈ విషయమై తమకు పార్టీ అధిష్టానం నుండి హామీ ఇవ్వాలని గాంధీభవన్‌లో బైఠాయించారు.
సంబంధిత వార్తలు
టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి