టీడీపీలో ముసలం: మెనిగళ్లపై చెప్పులు విసిరిని మువ్వ వర్గీయులు, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Nov 4, 2018, 11:29 AM IST
Highlights

 గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ  నేతలు  ఆదివారం నాడు పరస్పరం దాడి చేసుకొన్నారు.


హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ  నేతలు  ఆదివారం నాడు పరస్పరం దాడి చేసుకొన్నారు. శేరి లింగంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌పై మువ్వ సత్యనారాయణ అనుచరులు చెప్పులు విసిరారు.దీంతో ఇరు వర్గాల మధ్యవాగ్వాదం చోటు చేసుకొంది.

2014 ఎన్నికల వరకు  మువ్వ సత్యనారాయణ టీడీపీలోనే ఉన్నారు. ఆ ఎన్నికల సమయంలో టీడీపీ టిక్కెట్టును ఆశించారు.  శేరి లింగంపల్లి టిక్కెట్టు మువ్వ సత్యనారాయణకు కాకుండా అరికెపూడి గాంధీకి దక్కింది.  దీంతో మువ్వ సత్యనారాయణ టీడీపీకి గుడ్ ‌బై చెప్పి  టీఆర్ఎస్‌లో చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత అరికెపూడి గాంధీ కూడ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

అయితే ఇటీవల  కాలంలో   మువ్వ సత్యనారాయణ టీఆర్ఎస్  నుండి తిరిగి టీడీపీలో చేరారు. శేరిలింగంపల్లి టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్నారు.ఇదిలా ఉంటే  ఇదే నియోజకవర్గం నుండి  టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్న  మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌ ఆదివారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ విషయం తెలిసిన మువ్వ సత్యనారాయణ వర్గీయులు అడ్డుకొన్నారు.

మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్‌పై మువ్వ సత్యనారాయణ వర్గీయులు చెప్పులతో దాడికి దిగారు.  ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ర్యాలీని మువ్వ సత్యనారాయణ అనుచరులు అడ్డుకొన్నారు.

వర్గాల  ఆందోళనల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆనంద్ ప్రసాద్ పై ఒకనొక దశలో మువ్వ వర్గీయులు చెప్పులు విసిరారు. మువ్వ వర్గీయుల ఆందోళనతో ర్యాలీని విరమించుకోవాలని ఆనంద్ ప్రసాద్ కు పోలీసులు సూచించారు. ఆనంద్ ప్రసాద్ ప్రచార వాహనానికి అడ్డుగా  మువ్వ వర్గీయులు కూర్చొన్నారు.

 

సంబంధిత వార్తలు

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

click me!