
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తింది.. ఉదయం సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం రావడంతో అరగంట పాటు రైళ్లు కదల్లేదు.. వెంటనే స్పందించిన సాంకేతిక నిపుణులు సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు... దీంతో పలు మార్గాల్లో మెట్రోలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
రైళ్లు ఎక్కిన వారు గమ్యస్థానాలకే చేరాల్సిన సమయంలో చేరలేని పరిస్థితి నెలకొంది. ఉదయం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్‌కు గంట లోపు చేరుకోవాల్సిన రైళ్లు, రెండు గంటల సమయాన్ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.