నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

Published : Aug 29, 2018, 07:51 AM ISTUpdated : Sep 09, 2018, 11:06 AM IST
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

సారాంశం

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నల్గొండ జిల్లాలోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. నందమూరి హరికృష్ణ నడుపుతున్న వాహనం బుధవారం నాడు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.  

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నల్గొండ జిల్లాలోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. నందమూరి హరికృష్ణ నడుపుతున్న వాహనం బుధవారం నాడు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

బుుధవారం నాడు నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కారుకు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు, సినీ నటుడు జూనియర్  ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్  లు హైద్రాబాద్ బయలుదేరారు,

2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మంలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొని హైద్రాబాద్ తిరుగు ప్రయాణమైన సందర్భంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ కారు బోల్తా పడింది.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ సురక్షితంగా బయటపడ్డాడు.

నాలుగేళ్ల క్రితం ఓ సినిమాఫంక్షన్ ఏర్పాట్ల కోసం హరికృష్ణ తనయుడు జానకీరామ్ హైద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని మునగాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ అక్కడికక్కడే మరణించాడు.

జాతీయరహదారిపై సర్వీస్ రోడ్డు నుండి జాతీయ రహదారిపై ఇసుక ట్రాక్టర్ రావడంతో జానకీ రామ్ కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో కూడ కారులో జానకీరామ్ ఒక్కడే ఉన్నాడు.
అతడిని ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపట్లలోనే ఆయన చనిపోయాడు.

తాజాగా నార్కట్ పల్లి మండలం అన్నెపర్తి వద్ద  బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

2014 ఎన్నికలకు ముందు నార్కట్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు లాల్ జాాన్ భాషా చనిపోయాడు.

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ మృతి ( వీడియో)

ఆస్పత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్: ఇంటికి చేరుకుంటున్న బంధువులు

ప్రజల్లో చెరగని ముద్ర... హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

హరికృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?