సీరియల్ కిల్లర్.. 20మందిని చంపిన తాంత్రికుడు..

By SumaBala Bukka  |  First Published Dec 11, 2023, 8:36 AM IST

హైదరాబాద్ లో ఓ హత్య కేసు దర్యాప్తులో తాంత్రికుడికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. 


నాగర్ కర్నూల్ : ప్రజల బలహీనతలను అడ్డు పెట్టుకుని మోసం చేసే బాబాలు, స్వాముల గురించి తెలిసిందే. అయితే ఇతను అంతకుమించి.. గుప్తనిధులు, ఉద్యోగాలు, మంచి అవకాశాలు.. ఇలాంటి అనేక రకాల కారణాలతో జనాలను మభ్యపెట్టి, మాయచేసి.. మోసం చేయడం.. ఆ తరువాత వారిని హత్య చేయడం.. ఆ తరువాత తప్పించుకుని తిరగడం.. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందిని హత్య చేశాడో సీరియల్ కిల్లర్. 

అయితే, ఇదంతా ఆథ్యాత్మికత, తాంత్రిక పూజల ముసుగులో చేయడం కలకలం రేపుతోంది. హత్యలు చేస్తూ దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎలా వెలుగు చూసింది అంటే.. ఓ హత్య కేసులో పోలీసులకు చిన్న క్లూ దొరికింది. దాన్ని పట్టుకుని దర్యాప్తు చేస్తుంటే.. డొంకంతా కదిలింది. అసలు హంతకుడు ఎవరో తేలడంతో పాటు.. అతను ఇప్పటికే 20 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ అని తేలడంతో షాక్ అయ్యారు. 

Latest Videos

హిందువుల కలలు సాకారం : రామ మందిరంపై కవిత ఆసక్తికర ట్వీట్

ఆ తాంత్రికుడి మీద ఇప్పటికే , నాగర్ కర్నూల్, ఏపీలోని పలు పిఎస్ లలో కేసులు నమోదయ్యాయి. తాంత్రిక పూజలతో ఎర వేసి, అదును చూసి చంపేయడం ఇతనికి మామూలు. రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఓ కుటుంబంలోని నలుగురిని చంపేశాడు ఈ తాంత్రికుడు. ఇటీవల ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని ఆ తరువాత అంతమొందించాడు. 

హైదరాబాద్ లో ఓ హత్య కేసు దర్యాప్తులో తాంత్రికుడికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. 

click me!