TSRTC: పురుషులకు ప్రత్యేక బస్సులు?.. ‘మహాలక్ష్మీ’తో బస్సుల్లో రద్దీ.. ప్రత్యామ్నాయ ఆలోచనల్లో ఆర్టీసీ

By Mahesh KFirst Published Dec 27, 2023, 5:52 AM IST
Highlights

మహాలక్ష్మీ పథకంతో మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. పురుషులకు, విద్యార్థులకు సీట్లు దొరకడం లేదు. చాలా సార్లు రష్ చూసి బస్సు ఎక్కడం లేదనే అంశంపై ఆర్టీసీ సిబ్బంది, ఎండీ చర్చించారు. పురుషులకు, విద్యార్థులకు ఆయా మార్గాల్లో ఆయా సమయాల్లో ప్రత్యేక బస్సులు నడిపే ఆలోచనలు చేస్తున్నది. 
 

TSRTC: మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. గణనీయంగా ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ప్రయాణికుల తాకిడీ భారీగా ఉన్నది. ముందు వరుస నుంచి చివరి వరకూ మహిళలే ఉంటున్నారు. పురుషులకు మాత్రం ఈ పరిణామం కొంత ఇబ్బందిగా మారింది. స్కూల్ పిల్లలకూ సవాలుగానే ఎదురైంది. పలుచోట్ల బస్సు రద్దీగా ఉండటంతో స్కూల్ పిల్లలు బస్సు ఎక్కకుండా వెయిట్ చేస్తున్నారు. పురుషుల పరిస్థితి ఇలాగే ఉన్నది. బస్సులు నిండు కుండలా వస్తుండటంతో పలువురు ప్రైవేటు వాహనాల వైపు మళ్లుతున్నారు. ఈ పరిణామాలను ఆర్టీసీ సిబ్బంది.. సంస్థ ఎండీ ముందు ప్రస్తావించినట్టు సమాచారం.

దీంతో అవసరమైన రూట్టల్లో, సమాయాలల్లో పురుషులకు ప్రత్యేక బస్సులు నడిపితే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలను ఆర్టీసీ చేస్తునది. వృద్ధులకూ ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు గురించీ సమాలోచనలు చేస్తున్నది. అలాగే.. విద్యార్థుల సమస్యకూ పరిష్కారాన్ని వెతికే పనిలో ఉన్నది. వారు వెళ్లే మార్గంలో కొన్ని ప్రత్యేక సర్వీసులు నడుపాలా? అనే ఆలోచనలు చేస్తున్నది. దీనిపై ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

ఉచిత పథకంతో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ విపరీతంగా పెరుగుతున్నది. గతంలో 69 శాతం ఉన్న ఈ రేషియో ఇప్పుడు 89 శాతానికి పెరిగింది. గతంలో మహిళా ప్రయాణికులు 12 నుంచి 14 లక్షల మంది ఉండగా.. ఇప్పుడు 29 లక్షలు చేరడం గమనార్హం.

Also Read: Top Stories: పీఎంతో సీఎం భేటీ.. నేడు సింగరేణి పోరు.. పాక్‌లో హిందూ మహిళ పోటీ

పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు సాధ్యం కాని పక్షంలో మహిళలకే సెపరేట్ బస్సు నడపాలనే ఆలోచనలూ ఆర్టీసీ ఉన్నతాధికారులు చేస్తున్నారు.

click me!