బీజేపీ తెలంగాణలో తన టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్స్ సంపాదించుకోవాలని టార్గెట్ ఫిక్స్ వివరించింది.
Hyderabad: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్స్ ఎంపీ సీట్లను గెలవాలని బలంగా సంకల్పిస్తున్నది. ఇందుకోసం అనేక వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మొత్తం 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. జనవరి నుంచి ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధం అవుతుంది. తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు తామే కొల్లగొట్టాలని బీజేపీ భావిస్తున్నది.
ప్రస్తుతం బీజేపీకి తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(సికింద్రాబాద్), కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావులు ఉన్నారు. ఇందులో ముగ్గురికి మళ్లీ టికెట్లు దాదాపు కన్ఫమ్ అయిపోయాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లకు మళ్లీ టికెట్ ఇవ్వవచ్చు. సోయం బాపూరావుకు మళ్లీ టికెట్ రావడం కష్టంగానే ఉన్నది.
కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లు పోటీ చేస్తున్న లోక్ సభ స్థానాల్లో వీరికి మించిన నాయకులు లేరు. కానీ, ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం రాథోడ్ బాపూ రావు, మాజీ టీడీపీ ఎంపీ రమేశ్ రాథోడ్‌లు పోటీలో ఉన్నారు. వీరితోపాటు సీనియర్ లీడర్లు ఈటల రాజేందర్, కే రఘునందన్ రావు, పీ మురళీధర్ రావు, డీకే అరుణ, పీ. జితేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌లు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Also Read: పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్..సీఐ సస్పెండ్.. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుపై కేసు
తెలంగాణలో డబుల్ డిజిట్స్ ఫలితాల కోసం మేం ఎదురచూస్తున్నాం. డిసెంబర్ 28వ తేదీన రాష్ట్రస్తాయి సమావేశాల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోడీని చూడాలని ప్రజలు ఉబలాటపడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆశించినట్టుగా లేవని, అందుకే తాము పార్లమెంటు ఎన్నికల్లో