రాజేంద్రనగర్ క్రాకర్స్ షాపు అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు...

By SumaBala Bukka  |  First Published Nov 11, 2023, 10:26 AM IST

రాజేంద్రనగర్ క్రాకర్స్ షాపు అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నట్లుగా తెలుస్తోంది. అది షార్ట్ సర్క్యూట్ కాదని, కావాలనే నిప్పు పెట్టాలని సమాచారం. 


హైదరాబాద్ : శనివారం తెల్లవారు జామున రాజేంద్రనగర్ క్రాకర్స్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్తకోణం వెలుగు చూస్తోంది. ఇది ప్రమాదం కాదని, ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కావాలనే ఆకతాయి క్రాకర్స్ షాపుకు నిప్పు పెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. దీంతోనే ఈ ప్రమాదంలో కుట్ర కోణం దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ లో ప్రమాదానికి కాస్త ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా క్రకర్ షాపు ముందు తిరగడం కనిపిస్తోంది.  

ఆ తర్వాత రెండు నిమిషాల్లోనే క్రాకర్స్ షాపుకు నిప్పు పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. అతడు వెళ్లిన కాసేపటికే షాపులో మంటలు చెలరేగాయి. అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానితుడు ఎవరని ఇంకా తెలియ రాలేదు. అర్థరాత్రి 2.58 ని.లకు అనుమానితుడు ఆ షాపు ముందు కనిపించాడు. ఆ తరువాత కాసేపటికే అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

Latest Videos

దీపావళి 2023 : రాజేంద్రనగర్ క్రాకర్స్ షాపు లో భారీ అగ్ని ప్రమాదం..

ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సన్ సిటీలోని ఓ క్రాకర్స్ షాపులో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రంగా మారింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, క్రాకర్స్ షాపు పక్కనే ఉన్న ఫుడ్ కోర్టు, పాన్ షాప్, టీ స్టాల్ కు మంటలు అంటుకున్నాయి. ఇవి పూర్తిగా దగ్థం అయిపోయాయి. 

అర్థరాత్రి 12 గంటలవరకు వారు క్రాకర్స్ ను సర్దుకుని పడుకున్నారు. అయితే.. షాపును కొంచెం తీసిపెట్టారు. 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మంటల వేడికి, పొగకు మెలుకువ వచ్చిన షాపులోని వారు తప్పించుకోగలిగారు. అయితే, ఈ క్రాకర్స్ షాపు రేకుల షెడ్డులో టెంట్ హౌస్ గోడౌన్లో ఏర్పాటు చేశారు. దీంతో టెంట్ హౌస్ కు సంబంధించిన గోదాం పూర్తిగా దగ్థమయ్యింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ ఆస్తి నష్టం భారీ స్థాయిలో జరిగినట్టుగా సమాచారం. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి తీవ్ర స్తాయిలో ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!