జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ర్యాగింగ్ భూతం.. జూనియర్లతో సీనియర్ల అసభ్య ప్రవర్తన...

Published : Jul 30, 2022, 11:04 AM IST
జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ర్యాగింగ్ భూతం.. జూనియర్లతో సీనియర్ల అసభ్య ప్రవర్తన...

సారాంశం

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు, జూనియర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, తీవ్ర వేధింపులకు గురిచేయడంతో వారిమీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

హైదరాబాద్ :  హైదరాబాద్ రాజేంద్రనగర్  లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం విద్యార్థులు సుమారు 20 మందిని సీనియర్లు తీవ్రంగా వేధించినట్లు వెలుగులోకి వచ్చింది.  వారం రోజుల క్రితం సీనియర్లు.. జూనియర్ల వసతి గృహంలోకి వెళ్లి వారి దుస్తులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడంతో పాటు, సీనియర్ల  హోంవర్క్లను వారితో చేయించారు. దీంతో బాధిత విద్యార్థి ఒకరు ఈ నెల 25న ఢిల్లీలోని హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో ఈ నెల 26న ప్రత్యేక కమిటీని నియమించారు. 

ఈ కమిటీ రాగింగ్ జరిగిన విసయం నిజమేనని ధృవీకరిస్తూ 27న నివేదిక సమర్పించింది. ర్యాగింగ్ రాక్షస క్రీడలో మొత్తం 20 మంది సీనియర్లు పాల్గొన్నట్లు నిర్ధారించింది. కమిటీ నివేదిక ఆధారంగా వర్సిటీ ఉన్నతాధికారులు ఇరవై మంది విద్యార్థుల పై కఠిన చర్యలు తీసుకుంటూ 28న ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిని ఓ సెమిస్టర్ పాటు తరగతి నుంచి, డిగ్రీ పూర్తయ్యేవరకు వసతిగృహం నుంచి సస్పెండ్ చేశారు. మరో 13 మందిని వసతిగృహం నుంచి సస్పెండ్ చేస్తూ..  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. వీరు బయట నుంచి తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు.

మరోసారి తెరపైకి క్లబ్ మస్తీ పబ్‌ గలీజ్ దందా.. యువతులతో అశ్లీల దందా..

ఇక, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేధిస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మరొకటి వెలుగుచూసింది. ఈ విద్యాలయంలో 6 నుంచి 12 తరగతుల వరకు కేవలం విద్యార్థినులే చదువుతున్నారు. సీనియర్ల వేధింపుల సమస్య కారణంగా గురువారం ఓ విద్యార్థిని టీసీ తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు జూనియర్ తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం విద్యాలయానికి వచ్చి ఉపాధ్యాయులతో గొడవకు దిగారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన పలువురు విద్యార్థినులు తమను ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు, విలేకరుల ముందే ఉపాధ్యాయినులతో వాగ్వాదానికి దిగారు 8, 10,11 తరగతుల బాలికలు మాట్లాడుతూ..  సీనియర్లు తమను గదుల్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వివరించారు.

చెల్లిగా ఉండాలంటూనే ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఓ విద్యార్థిని సీనియర్ రాసిన ప్రేమలేఖను చూపించారు.  ప్రిన్సిపల్  దీని మీద స్పందిస్తూ  సమస్య ఈ రోజే తన దృష్టికి వచ్చిందని అన్నారు. సీనియర్ల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతానని..  సమస్యను పరిష్కరిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఉపాధ్యాయినులు నిత్యం విద్యార్థులతో పాటు వసతి గృహాలలో బస చేస్తున్నా.. వేధింపుల విషయం గ్రహించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆ విద్యాలయాల సెక్టోరియల్ అధికారిని ఉన్నతాధికారులు ఆదేశించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?