క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌజ్ లో మినీ జూపార్క్..

By Bukka Sumabala  |  First Published Jul 30, 2022, 10:13 AM IST

కాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఫాంహౌజ్ లో మినీ జూపార్కే ఉండడం చూసి అధికారులు అవాక్కయ్యారు. రకరకాల అరుదైన జాతుల జంతువులు, పక్షులు ఇక్కడ ఉన్నాయి. 


హైదరాబాద్ : ఓ పక్క ఆఫ్రికాలో కనిపించే అరుదైన చిలుకలు.. మరోపక్క అంతకన్నా అరుదైన పాములు, ఉడుములు ఊసరవెల్లులు.. ఒకటా రెండా 24 రకాల పక్షులు, జంతువులు.. ఇదేదో జూ పార్క్ గురించిన వర్ణన కాదు.. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లో కనిపించే జీవాలు ఇవన్నీ.  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డి గూడలో చీకోటికి 12 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. శుక్రవారం అక్కడ తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు ఆదివారం.. ఆ జీవాలను చూసి అవాక్కయ్యారు వాటన్నింటినీ అతడు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల నుంచి రప్పించినట్లు సమాచారం.

వాస్తవానికి.. చీకటి ఫాంహౌస్లో ఉన్న ఈ జంతువులు, పక్షుల గురించి చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది. చీకోటి స్వయంగా ఊసరవెల్లితో దిగిన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. అయినా అటవీశాఖ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.. చూసీచూడనట్లు ఊరుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా హడావుడిగా రంగంలోకి దిగి మూడు గంటల పాటు తనిఖీలు చేసి వివరాలు సేకరించారు.

Latest Videos

undefined

చీకోటి ప్రవీణ్ వాట్సాప్ లో కీలక సమాచారం: డేటాను పరిశీలిస్తున్న ఈడీ అధికారులు

ఫాంహౌస్ లో ఉన్న విదేశీ పక్షులు పాములు, జంతువుల గురించి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. వన్యప్రాణుల పెంపకానికి సంబంధించి గతంలోనే చికోటి అనుమతులు తీసుకున్నాడని అయితే  అనుమతి లేని వాళ్ళు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామని,  శనివారం నాటికి తమ విచారణ పూర్తవుతుందని తెలిపారు. కాగా, అతడి వద్ద చాలా అధికంగా ఉన్నాయని వాటికి సంబంధించి, పక్కాగా కేసులు నమోదు చేస్తే అతనికి ఏడేళ్ల జైలు శిక్ష ఖాయమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

చికోటి చిన్నప్పటి నుంచి జంతువుల అంటే చాలా ఇష్టమని అతని సన్నిహితులు బంధువులు చెబుతున్నారు. చిన్నవయసులో ఒకసారి ఇంటి వద్ద ఎలుగుబంటిని ఆడిస్తూ అడుక్కునే వ్యక్తి వస్తే ఆ ఎలుగుబంటి కావాలని మారాం చేశాడని దీంతో అతడికి డబ్బులు ఇచ్చి రెండు రోజులపాటు చేశాడని వారు వెల్లడించారు. వివరించారు ఆ ప్రేమతోనే ఫాంహౌస్లో జంతువులను ప్రేమిస్తున్నాడని వారు వివరించారు 
 

click me!