హాస్టల్ రూమ్‌లో బంధించి జూనియర్‌పై సీనియర్ల దాడి... హైదరాబాద్ ఐఎస్‌బీలో కలకలం

Siva Kodati |  
Published : Nov 11, 2022, 06:02 PM IST
హాస్టల్ రూమ్‌లో బంధించి జూనియర్‌పై సీనియర్ల దాడి... హైదరాబాద్ ఐఎస్‌బీలో కలకలం

సారాంశం

హైదరాబాద్ ఐఎస్‌బీలో ఒక జూనియర్ విద్యార్ధిపై సీనియర్ విద్యార్ధులు పైశాచికంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలను సదరు విద్యార్ధి సీపీ, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ ఐఎస్‌బీలో విద్యార్ధిపై దాడి కలకలం రేపింది. ఒక జూనియర్ విద్యార్ధిపై సీనియర్ విద్యార్ధులు పైశాచికంగా దాడి చేశారు. హాస్టల్ రూమ్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలను సదరు విద్యార్ధి సీపీ, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

అంతకుముందు ... పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.  హాస్టల్ రూమ్‌లో అంకిత్ అనే విద్యార్ధిపై కర్రలు, పీవీసీ పైపులతో దాడి చేశారు సహచరులు. వాటితో విచక్షణారహితంగా కొట్టారు. ఐరన్ బాక్సుతో అతని ఛాతీపై వాతలు పెట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అంకిత్ ప్రస్తుతం భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది