సోమవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లిని రాష్ట్ర Dalitbandhu Chairman గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే, ఈ హోదాతో పాటు ఆయన్ను పెద్దల సభకు పంపే యోచనలో సీఎం kcr ఉన్నారని, సీనియర్ దళిత నాయకుడికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఆయన రెడీ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కొంతకాలంగా రాజకీయంగా నిస్తేజంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి జిల్లా రాజకీయ క్షేత్రంపై తళుక్కున మెరిశారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ సీనియర్ దళిత నాయకుడికి టీఆర్ఎస్ అధిష్టానం డబుల్ దమాకా ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సోమవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లిని రాష్ట్ర Dalitbandhu Chairman గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే, ఈ హోదాతో పాటు ఆయన్ను పెద్దల సభకు పంపే యోచనలో సీఎం kcr ఉన్నారని, సీనియర్ దళిత నాయకుడికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఆయన రెడీ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని పకడ్బంధీగా అమలు చేయడంతో పాటు దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు గాను మోత్కుపల్లిని శాసనమండలికి పంపుతారని సమాచారం. ఇందుకు జిల్లా రాజకీయ, సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తున్నాయని ఉమ్మడి జిల్లా TRS వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే ఉన్నతస్థాయిలో చర్చ జరిగిందని, ఈ చర్చలో వచ్చిన ఎమ్మెల్సీ ప్రతిపాదనకు జిల్లా మంత్రి Jagadish Reddy కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లికి ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాయమని, అయితే పార్టీలో చేరిన వెంటనే ఇస్తారా? సమయం చూసి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద మోత్కుపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖరారయ్యిందని, అయితే ఎప్పుడిస్తారనేది మాత్రమే సస్పెన్స్ అని జిల్లా టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
టీఆర్ఎస్‌లోకి మోత్కుపల్లి నర్సింహులు.. ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే..?
గవర్నర్ పోటీదారు : వాస్తవానికి, మోత్కుపల్లి నర్సింహులు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా నేతగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంతంలో tdpలో కీలకంగా వ్యవహరించిన మోత్కుపల్లి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలాకాలం పాటు ఆ పార్టీలోనే కొనసాగారు.
అప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడం, కేంద్రంలో bjpప్రభుత్వం ఉండడంతో చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు చెప్పి తనకు గవర్నర్ హోదా ఇప్పిస్తారని ఆశించారు. కానీ, ఎప్పటిలాగే చంద్రబాబునాయుడు మార్కు రాజకీయానికి బలయిన మోత్కుపల్లి అక్కడి నుంచి కాషాయ గూటికి చేరారు. కానీ, బీజేపీలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. దళితబంధు పథకం ప్రకటన తరువాత ఆయన టీఆర్ఎస్ పక్షం వహించారు.
దళిళ వర్గాలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని బలంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గులాబీ సేనకు దగ్గరైన మోత్కుపల్లి తన మలిదశ రాజకీయ ప్రస్థానాన్ని గులాబీ గూటి నుంచి ప్రారంభిస్తున్నారు. మరి మోత్కుపల్లి మలిదశ ప్రస్తానం ఏ మలుపులు తిరుగుతోంది. ఆయనకు ఎలాంటి పదవులు కట్టబెడుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నేడు టీఆర్ఎస్ లోకి...
సీనియర్ రాజకీయ వేత్త.. mothkupally narsimhulu సోమవారం 18,(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు telangana bhavanలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలోని సీనియర్ నేతల్లో ఒకరు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. బీజేపీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ సమయంలో కేసీఆర్ తీసుకొచ్చిన dalit bandhu schemeపై పొగడ్తల వర్షం కురిపించారు నర్సింహులు. కేసీఆర్ ను ఏకంగా అభినవ అంబేద్కర్‌గా కీర్తించారు మోత్కుపల్లి. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని నర్సింహులు పిలుపునిచ్చారు. దీంతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఇరు వర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.