జనగామ: బస్సులో చెలరేగిన మంటలు... సిబ్బంది సహా ప్రయాణికులంతా సురక్షితం

By Arun Kumar PFirst Published Oct 18, 2021, 9:39 AM IST
Highlights

చత్తీస్ ఘడ్ నుండి 26మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 

జనగామ: ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులోనే 26మంది ప్రయాణికులు వున్నా ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకుండానే సురక్షితంగా బయటపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... చత్తీస్ ఘడ్ నుండి హైదరాబాద్ కు 26మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు బయలుదేరింది. అయితే బస్సు janagam జిల్లా మీదుగా వెళుతుండగా ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ ఇంజన్ లోంచి పొగలురావడం గమనించి వెంటనే అప్రమత్తమయ్యాడు. 

బస్సులోని సిబ్బంది ప్రయాణికులను వెంటనే కిందకు దించేసారు. ఆ తర్వాత బస్సులో పెద్దగా మంటలు చెలరేగాయి. దీంతో  ఫైర్ ఇంజన్‎కు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న fire సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

read more  ఖమ్మం: నవరాత్రి వేడుకల్లో అపశృతి... అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్ బోల్తా, నలుగురు మృతి

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి ప్రయాణికులను హైదరాబాద్ కు తరలించే ఏర్పాటు చేసారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను క్లియర్ చేశారు.  

విరామం లేకుండా ప్రయాణించంతో ఇంజన్ హీటెక్కి మంటలు చెలరేగి వుంటాయని అనుమానిస్తున్నారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో తృటిలో ప్రయాణికులంతా ప్రమాదం నుండి బయటపడ్డారు. కొద్దిగా ఆలస్యమైనా ప్రయాణికులు మంటల్లో చిక్కుకునేవారు.  
 

click me!