తెలంగాణ రాష్ట్ర బిజెపి సహకోశాధికారి, మాజీ కార్పొరేటర్ భవర్‌లాల్‌వర్మ(63)ను కరోనా మహమ్మారి బలితీసుకుంది.
హైదరాబాద్: కరోనా మహమ్మారి బారిన పడి బిజెపి సీనియర్ నాయకుడొకరు మృత్యువాతపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి సహకోశాధికారి, మాజీ కార్పొరేటర్ భవర్‌లాల్‌వర్మ(63) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
వివరాల్లోకి వెళితే... బిజెపి సీనియర్ నాయకులు భవర్ లాల్ వర్మఈ ఏడాది ఫిబ్రవరిలోనే కరోనా బారిన పడ్డారు. అయితే వయసు మీదపడటంతో అతడిపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించింది. కొద్దిరోజులకే కరోనా తగ్గిపోయినప్పటికి ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ మాత్రం తగ్గలేదు. దీంతో గత రెండు నెలలుగా అతడు హాస్పిటల్ లోనే చికిత్స పొందారు.
read more మనిషినే కాదు మానవత్వాన్ని చంపిన కరోనా... రైలుకి ఎదురెళ్ళి కోవిడ్ రోగి హత్యహత్య
శనివారం ఉదయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో పాటు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. అతడి మరణవార్త కుటుంబంలోనే కాదు తెలంగాణ బిజెపిలోనూ విషాదాన్ని నింపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర, మోండా కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులు భవర్ లాల్ వర్మ మృతికి సంతాపం తెలియజేసి నివాళి అర్పించారు.