TRS Dharna:బిజెపి సర్కార్ తో ఇక యుద్దమే... రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 12, 2021, 11:39 AM IST
Highlights

తెలంగాణ అన్నదాతల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతోంది. సిద్దిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ ఈ రైతు ధర్నాలో పాల్గొన్నారు. 

హైదరాబాద్: వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బిజెపిల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. వానాకాలంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందంటూ ఇప్పటికే బిజెపి ఆందోళన చేపట్టింది. తాజా యాసంగిలో పండించే వరిధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శుక్రవారం ఆందోళనలకు సిద్దమయ్యింది. 

తెలంగాణ రాష్ట్రం, రైతుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా TRS Party ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం  తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని BJP Government  వైఖరిని నిరసిస్తూ ఈ ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. 

వీడియో

siddipet నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద మంత్రి హరీష్ రావు ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికే ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా  రైతులు, పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ధర్నా స్థలికి చేరుకున్నారు. మంత్రి హరీష్ ధర్నాస్థలికి చేరకుని పార్టీశ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టనున్నారు. 

read more   బీజేపీ నేతలు అవగాహన లేకుండా ధర్నాలు చేస్తున్నారు.. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

ఇదిలావుంటే ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా ఇప్పటికే టీఆర్ఎస్ అధినాయకత్వం వ్యూహరచన చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది గులాబీ సైన్యం రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొంటారని టీఆర్ఎస్ తెలిపింది.  

టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న(గురువారం) బిజెపి అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టింది. నేడు(శుక్రవారం) టీఆర్ఎస్ నిరసనకు దిగింది. ఇలా రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది మీరంటే మీరని బిజెపి, టీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు చేస్తున్నారు. 

హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టిఆర్ఎస్ నేతలు ఉమ్మడిగా ధర్నాలో పాల్గొననున్నారు. ఇప్పటికే దర్నాచౌక్ కు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరికాసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్వర్యంలో ధర్నా ప్రారంభం కానుంది.   

read more  వరిపై కేసీఆర్ పోరు: రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్‌కు షరతులతో అనుమతి

టీఆర్ఎస్ శ్రేణుల నిరసన సక్సెస్ అయ్యేలా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా జిల్లా ప్రధానకేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. 

ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని... వెంటనే రైతులవద్దగల ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నిన్న (గురువారమే) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బిజెపి ధర్నా చేపట్టింది. ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి నాయకులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, బిజెపి శ్రేణులకు మధ్య తోపులాట జరగింది. అయితే బిజెపి శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకోవవడంతో ఉద్రిక్తతకు తెరపడింది. 

 

 

click me!