ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్వరలోనే ఉప ఎన్నికలు: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలనం

By narsimha lodeFirst Published Nov 12, 2021, 10:52 AM IST
Highlights


యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గురువారం నాడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంస్థాన్ నారాయణపురం:ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు.ఈ ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు  తమ పార్టీ సన్నద్దంగా ఉందని ఆయన చెప్పారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు  గురువారం నాడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీ తరపున అసెంబ్తీకి తీసుకెళ్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

వారసత్వ రాజకీయంగా ఎదగకుండా తన సొంత పోరాట పటిమతో తాను నమ్మిన హిందూ ధర్మంతో మరాఠా సామ్రాజ్యన్ని పాలించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆలోచన విధానంలో తేడా వచ్చిందని raghunandan raoచెప్పారు. ఇందుకు  హుజురాబాద్ ఎన్నికల ఫలితమే నిదర్శనమేనని ఆయన పేర్కొన్నారు.యాసంగిలో Paddy విషయంలో ఏడేళ్ల నుంచి కొంటున్న కేంద్రాన్ని ఏ ఒక్క దగ్గర గుర్తు చేసుకొకపోగా రాష్ట్రం ప్రభుత్వమే ధాన్యం కొన్నదని కేసీఆర్ సర్కార్ స్వంత డబ్బా కొట్టుకుందని Bjp ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.ఈ ఒక్క ఏడాది బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం  చెబితే తప్పంతా కేంద్రానిదే అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా జైలుకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యే రఘునందన్ ఉద్ఘాటించారు. 

also read:సిరిసిల్లలో ఉద్రిక్తత... బారికేడ్లను లాగేసి, పోలీసులను తోసుకుంటూ... కేటీఆర్ ఇలాకాలో బిజెపి ఆందోళన

గత నెల 30న నిర్వహించిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు. గత ఏడాదిలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్ధి గా పోటీ చేసి విజయం సాధించాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉప ఎన్నికలు వస్తాయని  రఘునందన్ రావు చేసిన ప్రకటన ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో  చర్చకు తెరతీసింది. ఎవరు రాజీనామా చేఃస్తారనే చర్చ సాగుతుంది. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ గాంధీ భవన్ లో జరిగే సమావేశాలకు హాజరు కావడం లేదు. అయితే సీఎల్పీ సమావేశాలకు అప్పుడప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరౌతున్నారు. అయితే కోమట్డి రెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ సమావేశాలకు హాజరయ్యేలా చూసే బాధ్యతను పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీసుకొన్నారు.ఈ విషయమై ఇటీవలనే  అసెంబ్లీ ఆవరణలో సీఎల్పీ కార్యాలయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో హనుమంతరావు చర్చించారు.అయితే జిల్లాలో మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే ఉన్నారు. అయితే ఏ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తారనే చర్చ ప్రస్తుతం నెలకొంది.


 

click me!