బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: మోడీ టూర్‌కి భారీ భద్రత, 5 వేల మంది పోలీసులతో పహారా

By Siva KodatiFirst Published Jun 29, 2022, 2:30 PM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై 3న ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
 

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోడీ పర్యటనలో వున్నంత సేపు మూడంచెల భద్రత కల్పించనున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్ భవన్ చుట్టూ కేంద్ర బలగాలు పహార కాయనున్నాయి. రాజ్ భవన్ లో ప్రధాని మోడీ బసపై నిర్ణయం తీసుకోనుంది ఎస్పీజీ. రాజ్ భవన్ బసపై పూర్తి స్థాయి నివేదిక ఇచ్చారు సిటీ పోలీసులు. అమిత్ షా, రాజ్ నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే నోవాటెల్ హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. 

ఇకపోతే.. జూలై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో (parade ground secunderabad) బీజేపీ (bjp) నిర్వహించనున్న సభకు ‘విజయ సంకల్ప సభ’గా నామకరణం చేశారు. హెచ్ఐసీసీ నోవాటెల్ లో ప్రధాని మోడీ (narendra modi) సహా ఇతర ప్రముఖులు బస చేయనున్నారు. జూలై 2న బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్ఐసీసీ నోవాటెల్ కు హెలికాఫ్టర్ లో చేరుకోనున్నారు ప్రధాని. 3వ తేదీన లంచ్ లో తెలంగాణ వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు. నియోజకవర్గాల్లో బస చేసే జాతీయ కార్యవర్గ సభ్యుల షెడ్యూల్ సైతం ఖరారు చేశారు. శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులతో సమావేశమై.. పోలింగ్ బూత్ ల వారీగా పార్టీ పరిస్ధితిపై సమీక్షించనున్నారు. నియోజకవర్గాల్లోని ప్రముఖులతో భేటీ కానున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. 

ALso Read:హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్స్‌లో మోడీ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం

మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తాము తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేసేలా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది. జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. దీంతో హైదరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం సాగించాలని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఏ పార్టీ అయినా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తుంటాయి. అయితే బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. 

click me!