బీజేపీ గుళ్లు, దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తుంది.. వీటికి సమాధానమేది..?: జగ్గారెడ్డి

Published : Jun 29, 2022, 02:27 PM IST
 బీజేపీ గుళ్లు, దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తుంది.. వీటికి సమాధానమేది..?: జగ్గారెడ్డి

సారాంశం

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఎక్కడ అని ప్రశ్నించారు. ఉద్యోగులు విభజన, నది జలాల పంపకం ఏమైందని ప్రశ్నలు సంధించారు. విభజన చట్టంలోని అంశాలపై మోదీ సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ గుళ్లు, దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. 

అయితే మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. విభజన విభజన సమస్యలపై టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నేతలు ప్రధాని మోదీని కలవాలని జగ్గారెడ్డి అన్నారు. 

ఇక, జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటుగా ముఖ్యనేతలు అంతా హైదరాబాద్‌కు తరలిరానున్నారు. అంతేకాకుండా జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu