అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురు... బెయిల్ రిజెక్ట్, మూడు రోజుల కస్టడీ

By Arun Kumar PFirst Published Jan 11, 2021, 11:53 AM IST
Highlights

బోయినిపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం తిరస్కరించింది. 

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురయ్యింది. ఆమె బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్ట్ తిరస్కరించింది. అంతేకాకుండా ఇవాళ్టి నుండి ఈ నెల 13 వరకు పోలీస్ కస్టడీలోకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కి గురైన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.మియాపూర్ భూమి వ్యవహారంలో ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

read more భూముల కోసం కాదు.. పెద్ద తలకాయల స్కెచ్: భూమా మౌనిక సంచలన వ్యాఖ్యలు

బుధవారం అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. రిమాండ్ అనంతరం  అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగగా న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

  మరోవైపు ఈ కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. A1 గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు... విచారణ అనంతరం 41 సీఆర్పీ నోటీసు ఇచ్చి వదిలేశారు. కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఇంకా చూపించలేదు. హఫీజ్‌పేట్‌లోని భూ వివాదమే ఈ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు తేల్చిచెప్పారు.
 


 

click me!