తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ ఆరు జిల్లాల్లో జీరో కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Jan 11, 2021, 11:00 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ ఆరు జిల్లాల్లో జీరో కేసులు

సారాంశం

శనివారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 24,785మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 224మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 


హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో(శనివారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 24,785మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 224మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,90,008కు చేరితే టెస్టుల సంఖ్య 72,78,021కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 461 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,83,924కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4,518 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,439గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1566కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.90శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో జీరో కేసులు బయటపడ్డాయి. ఇక జోగులాంబ గద్వాల 3, కామారెడ్డి 2, ఆదిలాబాద్ 8, జనగామ 1, జగిత్యాల 8, మహబూబాబాద్ 5, మెదక్ 6, నాగర్ కర్నూల్ 3, నిజామాబాద్ 7,  సిరిసిల్ల 8, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 4,  పెద్దపల్లి 5, సిద్దిపేట 2, సూర్యాపేట 2, భువనగిరి 6, మంచిర్యాల 7, నల్గొండ 2, వనపర్తి 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా  56కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 13, రంగారెడ్డి 26, కొత్తగూడెం 7, కరీంనగర్ 13, ఖమ్మం 3,  సంగారెడ్డి 11, వరంగల్ అర్బన్  11కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:


 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?