MLA Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో కన్నుమూశారు. కాగా, ఇటీవల లాస్య నందిత వరుసగా మూడు ప్రమాదాలకు గురయ్యారు. చివరకు మూడో ప్రమాదంలో ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు.
MLA Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఉదయం మృతి చెందారు. పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించబోయి.. అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయగా.. డ్రైవర్ కు తీవ్రగాయ్యాలయ్యాయి. అయితే ఆమె ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురైనట్టు తెలుస్తోంది. మృత్యువు వెంటాడుతోందా అన్నట్లుగా వరుసగా ప్రమాదాల బారిన పడింది.
మొదటి ప్రమాదం..
లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నిక కొద్ది రోజులకు (రెండు నెలల క్రితం) సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. అయితే.. వెంటనే అప్రమత్తమైన ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టారు. దాంతో ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది.
రెండో ప్రమాదం..
ఎమ్మెల్యే గత పది రోజుల క్రితం ప్రమాదం బారిన పడింది. ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభకు హాజరైన లాస్య నందిత కారులో హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నార్కట్‌పల్లి వద్దకు రాగానే ఆమె కారు అదుపు తప్పిత రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమెకు, ఆమె పీఏ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ, రహదారి పక్కన విధులు నిర్వహిస్తున్న హోంగార్డుపైకి కారు దూసుకెళ్లడంతో అతడు ప్రమాణాలు కోల్పోయాడు.
మూడో ప్రమాదం..
మూడోసారి ప్రమాదంలో లాస్య నందిత మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఆమెను మృత్యువు వెంటడగా.. వరుసగా ప్రమాదాల బారిన పడ్డారు. చివరికి మృత్యుఒడిలోకి చేరారు.