
MLA Lasya Nanditha : బీఆర్ఎస్ నాయకురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పటాన్ చెరు ఓఆర్ఆర్ ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కన్నుమూశారు. గత ఏడాది ఆమె తండ్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాయన్న కూతురు లాస్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా గెలుపొంది, అసెంబ్లీలో అడుగుపెట్టిన స్వల్ప కాలంలోనే ఆమె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విచారకరం.