వెయిటింగ్‌లో 36 లక్షల మంది.. అందుబాటులో 4 లక్షల టీకాలే: తెలంగాణలో సెకండ్ డోస్‌కు ఇక్కట్లు

By Siva KodatiFirst Published May 6, 2021, 5:20 PM IST
Highlights

తెలంగాణలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. సెకండ్ డోస్ కోసం 36 లక్షల మంది రాష్ట్రంలో వెయిటింగ్ లిస్ట్‌లో వున్నారు. అయితే నాలుగు లక్షల డోసులే అందుబాటులో వున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సెకండ్ డోస్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు జనం. 

తెలంగాణలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. సెకండ్ డోస్ కోసం 36 లక్షల మంది రాష్ట్రంలో వెయిటింగ్ లిస్ట్‌లో వున్నారు. అయితే నాలుగు లక్షల డోసులే అందుబాటులో వున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సెకండ్ డోస్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు జనం. 

18 నుంచి 45 ఏళ్లలోపు వయసువారికి వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు తెలంగాణ అధికారులు. సీఎం ఆమోదం తర్వాత దీనిని అమలు చేయనున్నారు. తెలంగాణకు కరోనా వ్యాక్సిన్  డోసులు తక్కువగా వస్తుండటంతో ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలనే ఆలోచనలో వుంది ప్రభుత్వం. ముందుగా జర్నలిస్ట్‌లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు వంటి జనసంచారం వుండే ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Also Read:జీహెచ్ఎంసీ పరిధిలో ఫీవర్ సర్వే: కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ ప్రయోగం

మరోవైపు వీకేండ్ లాక్ డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్‌డౌన్ అవసరం లేదన్నారు. భవిష్యత్తులో కూడ వస్తోందని అనుకోవడం లేదన్నారు.

బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ పై సీఎం సరైన సమయలలో నిర్ణయం తీసుకొంటారని ఆయన తెలిపారు. కరోనా విషయంలో హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకొంటామన్నారు. లాక్ డౌన్ కంటే మంచి చికిత్స అందించడం ముఖ్యమన్నారు. లాక్‌డౌన్ పెట్టినా అప్పుడు పెద్ద తేడా ఉండదన్నారు. 
 

click me!