సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు దీక్ష: మద్దతు ప్రకటించిన నేతలు

By narsimha lodeFirst Published Oct 27, 2019, 5:59 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మద్దతుగా నిరహార దీక్ష చేస్తున్నారు. రెండు రోజులుగా హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు నిరహారదీక్షకు దిగాడు. ఆదివారం నాడు పలు పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావుకు మద్దతు ప్రకటించారు. 

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరహార దీక్ష చేపట్టిన ఆదివారం నాడు రెండో రోజుకు చేరుకొంది.

Also Read:ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గవర్నర్ తమిళిసై స్పందన ఇదీ

హైదరాబాద్ సీపీఐ కార్యాలయంలో సీపీఐ నేత నారాయణ, టీడీపీ నేత ఎల్. రమణతో పాటు పలువురు నేతలు  సీపీఐ నేత కూనంనేని సాంబశివరావును ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.

ఈ  సందర్భంగా టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడారు. సెల్ప్ డిస్మిస్ పేరుతో ఆర్టీసీ కార్మికులను భయబ్రాంతులు చేస్తున్నారని  టీడీపీ నేత ఎల్. రమణ అభిప్రాయపడ్డారు.

చర్చల పేరుతో ఆర్టీసీ కార్మికులను పిలిచి వారి సెల్‌ఫోన్లను లాక్కోవడం సరైంది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ చెప్పారు.కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని  నారాయణ కోరారు.

Also Read:ఒకే దెబ్బకు రెండు పిట్టలు: తమిళిసైకి కేసీఆర్ కౌంటర్!

కార్మికులపై తప్పుడు సంకేతాలు ఇవ్వడానికే ఈ చర్చలు నిర్వహించారని ఆరోపించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా కూడ కార్మిక సంఘం నేతలు సహకరించడం లేదనే చెప్పేందుకు ఈ చర్చలన నిర్వహించారని డాక్టర్ నారాయణ ఆరోపించారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలను మరింత పెంచుతామని డాక్టర్ నారాయణ చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈ నెల 28వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ విచారణ సమయంలో హైకోర్టులో ప్రభుత్వం ఏం చెప్పనుందనేది కూడ ప్రస్తుతం చర్చ సాగుతోంది. 

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 30వ తేదీన  సరూర్ నగర్ అసెంబ్లీ స్టేడియంలో సకల జనుల సమర భేరి సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, పార్టీలు మద్దతు ప్రకటించాయి.ఈ సభకు ఆర్టీసీ కార్మికులకు చెందిన కుటుంబాలకు చెందిన ఇద్దరేసి చొప్పున రావాలని ఆర్టీసీ జేఎసీ నేతలు కోరారు.

 

click me!