సీజనల్ వ్యాధులు ఇలా వస్తాయి

Published : Jun 15, 2017, 01:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సీజనల్ వ్యాధులు ఇలా వస్తాయి

సారాంశం

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భగభగమంటే ఎండ మంటలకు ఉపశమన కలిగింది. గత వారం పది రోజులుగా వర్షాలు కురుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇంకేముందని ఎంజాయ్ అని హల్ చల్ చేద్దామనుకుంటున్నారా..? అయితే సీజనల్ వ్యాధుల  ముప్పు పొంచి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. ప్రతిరోజూ ముసురు  వర్షాలు, భారీ వర్షాలు, మామూలు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  వర్షాకాలంలో మొదలయ్యే సీజనల్ వ్యాధులు కూడా నేనున్నానంటూ  జనాలను పీడించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే వ్యాధుల భారిన పడిన వారు ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, వాంతులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

 

ఇప్పటి వరకు నల్లకుంట లోని నీలోఫర్ ఆసుపత్రిలో 400 వరకు మాత్రమే ఓపి నమోదు ఉండగా గత రెండు  మూడు రోజులుగా  ఓపి సంఖ్య 600కు చేరిందని డాక్టర్లు చెబుతున్నారు.  దీనితోపాటు ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రుల ఓపి  కూడా అమాంతంగా పెరిగింది.

నీటి కాలుష్యం కూడా పెరిగే ప్రమాదముంది. వర్షాల వల్ల డ్రైనేజీల్లోని నీరు మంచినీటి పైపుల్లోకి చేరడం ఆ నీళ్లను నేరుగా తాగడంతో డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మురుగు నీరు నిల్వ ఉండడం, వర్షం నీరు నిల్వ ఉండడంతో దోమల వ్యాప్తి తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి.

తినేముందు చేతులను శుభ్రంగా సబ్సుతో కడుక్కోవాలి.

వేడి వేడి ఆహార పదార్థాలు తినాలి.

ఆహార పదార్థాల మీద నిండుగా మూతలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు లాంటివి వస్తే డాక్టర్ కు చూపించాలి. అవసరం లేకపోయినా యాంటిబయాటిక్స్ వాడరాదు.

 

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?