రాజ్యాంగ ధర్మాసనానికి అనర్హత పిటిషన్లు

Published : Nov 07, 2016, 09:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రాజ్యాంగ ధర్మాసనానికి అనర్హత పిటిషన్లు

సారాంశం

స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడన్న నమ్మకం లేదు సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ అయింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ దాఖలు చేసినపిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవిస్తున్నట్లు చెప్పింది.

 

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసం తమకు లేదని వ్యాఖ్యానించింది. అలాగే స్పీకర్‌ను ఆదేశించే అధికారం లేదని పేర్కొంది.. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్‌ను ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కాగా,

 

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందిచకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్ ... నెలనెలా రూ.81.400 శాలరీతో గవర్నమెంట్ జాబ్స్
తెలుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్.. SBI లో అకౌంట్ ఉంటే చాలు కోటి రూపాయలు