
తెలంగాణా ప్రభుత్వానికి బిజెపి కొత్త పేరుపెట్టింది. ఇది ’ఊరూర బారు-నీరు’ ప్రభుత్వం అని పార్టీ తెలంగాణా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇక ప్రభుత్వానికి పేరు పెట్టారు కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాడాలని కూడా ఆయన నిర్ణయించారు. మద్యం లేని మోదీ గారి గుజరాత్ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని, తెలంగాణాలో పారుతున్న మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఇది అబ్కారీ భవన్ ఎదుట అక్టోబర్ 11న మద్య వ్యతిరేక దీక్షతో ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. ఇతర విషయాల సంగతేమో గాని, మద్యం విస్తారంగా పారించడంలో, వూరురికి అందించడంలో మాత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ నెంబర్ వన్ అన్ని అన్నారు. మద్య నియంత్రణ కు పూనుకొనకపోతే, తాము రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.