కెసిఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు

Published : Aug 04, 2017, 07:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కెసిఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు

సారాంశం

కెసిఆర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబేద్కర్ సంఘం మీరాకుమార్ ను కించపరిచేలా మాట్లాడినందుకు ఫిర్యాదు

కెసిఆర్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ హైదరాబాద్ లోని నాచారం పోలీసులకు ఫిర్యాదు అందింది. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచితంగా మాట్లాడిన విషయం తెలిసిందే. మీరా కుమార్ ను కించపరిచేవిధంగా వాఖ్యలు చేసిన కెసిఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.శ్రీహరి. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పై అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు అందడం ఇదే మొదటిదిగా చెబుతున్నారు. మరి ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేక చేయకుండా తాత్సారం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్
Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !